
ముంబై: డీమ్యాట్ ఖాతాల్లో నామినీల పేర్లను చేర్చేందుకు తుది గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పెంచినట్టు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకటించింది. నిజానికి తుది గడువు ఈ నెల 30తోనే ముగుస్తుంది. ఫిజికల్ సెక్యూరిటీ హోల్డర్‌లకు పాన్, నామినేషన్, సంప్రదింపుల వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, సంబంధిత ఫోలియో నంబర్ల నమూనా సంతకాన్ని కూడా డిసెంబరులోపు ఇవ్వవచ్చు.