ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇచ్చోడ,వెలుగు: ఉసిరి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని ఐటీడీఏ పీవో కె. వరుణ్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన ఉట్నూరు ఐటీడీఏలో ఉసిరి ఉత్పత్తులు తయారీ, నమూనాలు పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ 2011లో 500 మంది రైతులకు ఉసిరి మొక్కలు అందించినట్లు తెలిపారు. ఆదివాసీ సంపదగా ఉసిరి పచ్చళ్లు, మురబ్బా, మురవ, సుపారీ, క్యాండీ వంటి పదార్థాలు తయారు చేసేలా శిక్షణ ఇప్పించడం జరిగిందన్నారు. ఉట్నూర్ రైతు ఉత్పత్తి సంస్థ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  ప్రతినిధులు సత్యనారాయణ, జీవన్, చంద్రకాంత్, మంగమ్మ, అనిల్ కుమార్ తదితరులు 
పాల్గొన్నారు.

ఎన్నికల్లో సోషల్​ మీడియాతో కీలకపాత్ర

ఆదిలాబాద్​టౌన్​,వెలుగు: సోషల్​ మీడియాను వినియోగించుకోవాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. బుధవారం పార్టీ జిల్లా ఆఫీస్​లో జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​, ఐటీసెల్​రాష్ట్ర కన్వీనర్​వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ సెల్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో సోషల్​మీడియా కీలకంగా వ్యవహరించనుందన్నారు. సమావేశంలో లీడర్లు సాయి, జీవన్, రాజేశ్, భూపేందర్, ఆయా మండలాల సోషల్ మీడియా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తాం

ఆసిఫాబాద్,వెలుగు: జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్స్ లో నిర్వహించిన టీయుడబ్ల్యూజే ( ఐజేయు) జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజ్మీర శ్యాంనాయక్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, ట్రెజరర్​అడప సతీశ్, ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ లీడర్ల అరెస్టు

నిర్మల్,వెలుగు: మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి నర్సాపూర్​(జి) లో దళితులను కించపర్చారని ఆరోపిస్తూ ఆందోళనలకు సిద్ధమైన కాంగ్రెస్ లీడర్లను బుధవారం గృహ నిర్బంధం చేశారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్​ రెడ్డి ఇంట్లో సమావేశమై ఆందోళన చేసేందుకు వస్తుండగా పోలీసులు అడ్డుకొని నిర్భందించారు. అక్కడి నుంచి నేరుగా పోలీస్​ స్టేషన్​ తరలించారు. అరెస్టు అయిన వారిలో లీడర్లు ఖలీం, జమాల్, మజార్​అలీ ఖాన్, జునైద్​, హర్షదొద్దీన్, సంతోష్, హరీశ్​ తదితరులు ఉన్నారు.

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా

జన్నారం,వెలుగు: టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి చెప్పారు. బుధవారం మండలంలోని చింతగూడ లక్ష్మీదేవి దేవస్థానం అవరణలో ఏర్పాటు చేసిన పీఆర్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బదిలీలు, ప్రమోషన్స్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టీచర్లకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందేలా చూస్తానన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కమాలకర్ రావు, లీడర్లు చెన్నకేశవరెడ్డి, కొండు జనార్దన్, జాడి మురళి, కట్టా రాజమౌళి, నగురు సత్యం  పాల్గొన్నారు.

ఆర్ఎంపీలకు పల్లె, బస్తీ దవాఖానల్లో అవకాశాలు కల్పించాలి

బెల్లంపల్లి,వెలుగు: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పల్లె, బస్తీ దావాఖానలల్లో ఆర్ఎంపీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా ఆర్ఎంపీల సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి బత్తుల రవి, నియోజకవర్గ అధ్యక్షుడు సూరం రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏవీ రమణాచారి మాట్లాడారు. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్ఎంపీలకు వృత్తి పరమైన శిక్షణనిచ్చి ధృవీకరణ పత్రాలు అందజేశారని తెలిపారు. జీవో నంబర్​429ని అమలుచేయాలని డిమాండ్​ చేశారు. ఏళ్లతరబడి ప్రజలకు సేవచేస్తున్న ఆర్​ఎపీలను గుర్తించాలన్నారు. సమావేశంలో లీడర్లు ముదాం రమేశ్, గుంద రాజేశం, కాసం పురుషోత్తం,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ఆసిఫాబాద్,వెలుగు: బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్ లో నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు. టీఆర్ఎస్​ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా పార్లమెంటు కో కన్వీనర్ కొలిపాక కిరణ్ కుమార్, ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, కో కన్వీనర్ రమేశ్​గౌడ్ ను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో లీడర్లు జొర్రీగల శ్రీకాంత్ , కృష్ణ కుమారి, కొట్నాక విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, కొంగ సత్యనారాయణ, ఆత్మారం నాయక్, గుల్బం చక్రపాణి, కాండ్రే విశాల్, చెర్ల మురళి, కుమ్రం వందన తదితరులు పాల్గొన్నారు.
========================
ఘనంగా వేంకటేశ్వర షాపింగ్​మాల్ ​​ప్రారంభం
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లిలో బుధవారం వేంకటేశ్వర షాపింగ్​మాల్​ప్రారంభమైంది. బెల్లంపల్లి,ఆసిఫాబాద్​ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​రేనికుంట్ల ప్రవీణ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతోందన్నారు. మాల్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు నల్ల మధు, నల్ల రవి, సురేశ్, మాల్​ ఏర్పాటుకు కృషిచేసిన కౌన్సిలర్ నీలి కృష్ణ, బాలాజీ యాడ్స్ యజమాని మహేశ్​ను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మంచిర్యాల ఎమ్మెల్యే తనయుడు విజిత్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్ గరుండ్ల లక్ష్మి, కార్మిక నాయకుడు చిప్ప నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ నల్ల చక్ర పాణి తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్​మెటీరియల్​ అందజేత

మందమర్రి,వెలుగు: మందమర్రి బీజేపీ మండల ప్రెసిడెంట్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్​సాఫ్ట్​బాల్ క్రీడాకారులకు బుధవారం రూ.25 వేల విలువైన స్పోర్ట్స్​మెటీరియల్ అందించారు. కోచ్​క్రీడా సామగ్రి కొరత విషయాన్ని తెలపడంతో వెంటనే స్పందించి పైడిమల్ల వర్షిత్,​ సాఫ్ట్ బాల్ అసోసియేషన్​జిల్లా కార్యదర్శి తాబేటి రాజేందర్, సీనియర్ కోచ్ తాబేటి నాగరాజుతో కలిసి క్రీడాకారులకు అందజేశారు.

సర్పంచ్ భార్య ఆత్మహత్య

భైంసా/కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి సర్పంచ్ ఎర్రొల్ల నవీన్ భార్య రవళి (25) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త, అత్తింటి వారే బలవంతంగా పురుగుల మందు తాగించి చంపారంటూ బంధువులు జిల్లా హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. మృతురాలిది నిర్మల్​ జిల్లా భైంసా మండలం దేగాం గ్రామం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..ఐదేళ్ల క్రితం లక్ష్మీరావులపల్లికి చెందిన నవీన్‌‌‌‌కు దేగాంకు చెందిన రవళితో పెళ్లి జరిగింది. వీరికి 11 నెలల కొడుకు ఉన్నాడు. మంగళవారం రవళికి దేగాంలో దింపి వస్తానని నవీన్ కారులో అన్నతో కలిసి బయలుదేరాడు. అయితే  రవళి మార్గ మధ్యలో వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో నవీన్​, ఆయన అన్న వెంటనే కామారెడ్డిలో హాస్పిటల్‌‌‌‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రవళి చనిపోయింది. కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం రవళిని భర్త వేధిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త, ఆయన బంధువులు రవళికి బలవంతంగా పురుగుల మందు తాగించారని పేర్కొంటున్నారు. భర్త నవీన్, బావ ప్రవీణ్‌‌‌‌, తోడి కోడలు సింధూజ, మామ నర్సయ్య చెల్లెను చంపారంటూ మృతురాలి అక్క ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్​ తెలిపారు.  

దళితులను బెదిరిస్తున్న మంత్రిపై చర్యలు తీసుకోవాలి

నిర్మల్,వెలుగు: అర్హులకు దళిత బంధు ఇవ్వాలని కోరుతున్న వారిని బెదిరింపులకు గురిచేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్​ డిమాండ్​చేశారు. బుధవారం సారంగపూర్ మండలం జాం గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంటే మంత్రికి భయం పట్టుకుందన్నారు. బీజేపీని లక్ష్యంగా చేసుకొని దళితులను విమర్శించడం, బెదిరించడం సమంజసం కాదన్నారు. హుజూరాబాద్​బై ఎలక్షన్​కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దళిత మహిళలకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. అరెస్టు చేసిన బీజేపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్​చేశారు. సమావేశంలో లీడర్లు కరిపె విలాస్, వెంకటేశ్, చంద్రశేఖర్, గంగాధర్​తదితరులు పాల్గొన్నారు.

మంత్రి రాజీనామా చేయాలి

దళితులను అవమానపర్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా చేయాలని దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్​డిమాండ్​చేశారు. బుధవారం ఆయన కలెక్టరేట్​ఎదుట నిరసన చేపట్టగా పోలీసులు అరెస్టుచేసి స్టేషన్​కు తరలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట సీనియర్​లీడర్లు కిషన్, దావ సాయన్న తదితరులు ఉన్నారు. నిర్మల్​లో మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. నర్సాపూర్​(జి) నుంచే మంత్రి పతనం ప్రారంభమవుతుందని బీజేపీ లీడర్లు మెడిసెమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్​ రెడ్డి పేర్కొన్నారు. 

జోగు రామన్నకు బీజేపీ నేత పరామర్శ

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి భోజమ్మ ఇటీవల మరణించడంతో బుధవారం ముథోల్ నియోజకవర్గ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​ఆయనను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సుభాష్​ జాదవ్, బీజేపీ లీడర్​ మానిక్ తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్​ లీడర్లు చరిత్రను అవమానిస్తున్నారు

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: టీఆర్ఎస్​ లీడర్లు మహనీయుల విగ్రహాలు తొలగించి చరిత్రను అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జడ్పీ మాజీ చైర్​పర్సన్​సుహాసినిరెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్​లోని భగత్​సింగ్​ చౌక్​ లో తొలగించిన భగత్​ సింగ్​విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం ఆమె ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆదిలాబాద్​లో కేవలం జోగు కుటుంబ చరిత్ర మాత్రమే ఉండేలా చేస్తున్నారని విమర్శించారు. చెత్తకుప్పలో పడేసిన విగ్రహాన్ని శుద్ధి చేసి తాము తిరిగి ప్రతిష్ఠించామని, గతం లో మాట ఇచ్చిన ప్రకారం ఎమ్మెల్యే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహనీయులకు తగిన  గౌరవాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

లాభాల వాటా ప్రకటనతో టీబీజీకేఎస్ సంబురాలు

మందమర్రి,వెలుగు: సింగరేణి కార్మికులకు లాభాల్లో 30 శాతం వాటా ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్​ప్రకటించడంతో బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. మందమర్రిలో యూనియన్​ వైస్​ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్​ ఆధ్వర్యంలో టీబీజీకేఎస్, టీఆర్ఎస్​లీడర్లు, కార్మికులు సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మార్కెట్​లో పటాకులు కాల్చారు. కార్యక్రమంలో లీడర్లు మేడిపల్లి సంపత్, జె.రవీందర్, బడికెల సంపత్, ఒ.రాజశేఖర్, తోట రాజిరెడ్డి, ఈశ్వర్, రమణ, పెండ్రి రాజిరెడ్డి, పవన్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.
==============
పీహెచ్ సీ భవనాల మరమ్మతుకు నిధులు మంజూరు
భైంసా,వెలుగు: నియోజకవర్గంలో పీహెచ్​సీ భవనాల మరమ్మతు, పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి  తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే హైదరాబాద్​లోని  మంత్రి హరీశ్​రావును కలిశారు. భైంసా ఏరియా హాస్పిటల్​కు రూ. 82 లక్షలు, లోకేశ్వరం పీహెచ్​సీకి రూ. 9.90 లక్షలు, మహాగావ్ ఆరోగ్య కేంద్రానికి రూ. 11 లక్షలు, కుంటాలకు రూ.19.50 లక్షలు, బాసరకు రూ. 23 లక్షలు మంజూరైనట్లు వివరించారు. ముధోల్30 పడకల ఆసుపత్రి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. భైంసా పట్టణానికి బస్తీ దవాఖాన మంజూరు అయ్యిందన్నారు.  

సీఐని సన్మానించిన ప్రజాప్రతినిధులు

ఇచ్చోడ,వెలుగు: ఇచ్చోడ సీఐగా బాధ్యతలు తీసుకున్న నైలు నాయక్​ను బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఇచ్చోడ మేజర్​గ్రామపంచాయతీ సర్పంచ్ సునీత చవాన్, ఉపసర్పంచ్ లోక శిరీశ్​రెడ్డి, ఎంపీటీసీ నిమ్మల శివ కుమార్ రెడ్డి, కత్తూర్ వార్ సంతోష్, గౌతమ్ రెడ్డి, చందు, రషీద్ తదితరులు పాల్గొన్నారు.