ఇంటర్ లో మార్కులు పెరుగుతున్నాయి

ఇంటర్ లో మార్కులు పెరుగుతున్నాయి

రీ వెరిఫి కేషన్, రీకౌంటింగ్ తో విద్యార్థులమార్కులు పెరుగుతున్నా యి. ఫ్రీగా రీకౌంటింగ్,రీవెరిఫికేషన్ చేస్తున్న విద్యార్థులతో పాటు ఫీజుకట్టి రీవెరిఫికేషన్ చేయించుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు 10 శాతం మంది మార్కుల్లోమార్పులు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెయిలైనవిద్యార్థుల్లో 3 శాతం నుంచి 5 శాతం మందివిద్యార్థులు పాసయ్యే అవకాశం ఉందని అధి-కారులు చెబుతున్నారు . రీవాల్యూయేషన్ పెడితేమరిన్ని ఎక్కు వ మార్కులు కలిసేవని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు . ఇంటర్ లోఆ విధానం లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు . పాసైన విద్యార్థులకు కూడా మార్కుల్లో పెద్ద తేడాలే వచ్చి నా ప్రభుత్వం ఉచితంగా రీవెరిఫికేషన్ , రీకౌంటింగ్ చేయట్లేదు. ఫీజుకట్టిన 46 వేల స్టూ డెంట్లు 1.08 లక్షల పేపర-్లను రీవెరిఫికేషన్, రీకౌంటిం గ్ చేయించుకుంటున్నారు . గత నెల 27 నుంచి రాష్ట్రం లోని 13కేంద్రాల్లో ప్రక్రియ జరుగుతోంది. 8,70,924మంది ఇంటర్ పరీక్షలు రాస్తే.. 3,28,400మంది ఫెయిలయ్యారు. 62.29 శాతం ఉత్తీర్ణతనమోదైంది.

వాటిపైనే దృష్టి…

దిద్దిన పేపర్లలో జీరో మార్కులు పడినవి, అసలేదిద్దని జవాబులను మాత్రమేలెక్చరర్లు పరిశీలిస్తున్నారు. సున్నా మార్కులు పడినప్రశ్న/జవాబుకు.. ఆ ఆన్సర్ ప్రశ్నకు తగినట్టు రీ-వెరిఫికేషన్ లో తేలితే ఒక మార్కు కలుపుతున్నట్టుతెలుస్తోంది. ఒకటీ, రెండు మార్కులతో పాసయ్యేవిద్యార్థులున్నా రీచెక్ చేసి ఆ మార్కులను కలుపుతున్నట్టు సమాచారం. ఎగ్జామినర్ , స్క్రూటినైజర్‌ సరిగా చూడని జవాబుల్లో నూ మార్కులు కలుస్తున్న-ట్టు తెలుస్తోంది. కొన్ని పేపర్లలో మొదటిసా రి వేసినమార్కులకు, మళ్లీ చెక్ చేసిన తర్వాత మార్కులకు తేడా వచ్చినా మొదటిసా రి వచ్చి న మార్కులనే విద్యార్థులకు వేసినట్టు గుర్తించారు. ఈ తప్పుల కన్నా సాఫ్ట్​వేర్ తప్పులే ఎక్కువగా ఉన్నాయని లెక్చరర్లు చెబుతు-న్నారు. అది సరిచేస్తే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేఅవకాశాలున్నాయని వివరిస్తున్నారు. హైదరాబా ద్‌సెంటర్లలో సంస్కృతంలో ఓ విద్యార్థి కి 5 మార్కులురాగా, రీవెరిఫికేషన్ లో 50 మార్కులు వచ్చి నట్టుతెలిసింది. లెక్కల్లో ఓ విద్యార్థికి 18 మార్కులు రాగారీవెరిఫికేషన్ లో 29, సివిక్స్ లో 18 మార్కులొచ్చి నవిద్యార్థి కి 39 మార్కులు వచ్చి నట్టు సమాచారం.ఇన్ని తప్పులు జరుగుతున్నా ఇంటర్ బోర్డు మాత్రంతన తీరు మార్చుకోలేదు . ఒక్కో లెక్చరర్ తో 30పేపర్లు దిద్దించాల్సింది. ఫలితాల అవకతవకలతోఒక్కో లెక్చరర్ తో అంతకన్నా ఎక్కువ పేపర్లు దిద్దిం-చారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ లోనూ అదే తీరు ఉన్నట్టు తెలుస్తోంది.పేపర్లు దిద్దాల్సి న అవసరం లేకపోవడంతో రోజూ 45పేపర్ల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.ఖమ్మం, మెదక్ జిల్లా సెంటర్లలో మాత్రం 60 పేపర్లుఇస్తున్నారని లెక్చరర్లు చెబుతున్నారు. ఖమ్మం లోఆందోళన కూడా చేశారు.

గ్లోబరీనాతో మళ్లీ ఇబ్బందులే…..

గ్లో బరీనా సాఫ్ట్​వేర్ విద్యార్థులను మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తోంది. సప్లిమెం టరీ ఫీజు చెల్లింపుకు మే4 (శనివారం) చివరి తేదీ. టైం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి.గ్లో బరీనా సాఫ్ట్​వేర్ లో సాంకేతిక సమస్యలతో ఫీజు కట్టినా కట్టలే దని చూపుతోంది. రెండు సబ్జెక్టులకు ఫీజుకట్టినా ఒక సబ్జెక్టుకే కట్టినట్టు చూపిస్తోంది. ఓ విద్యార్థికి అదే అనుభవం ఎదురైంది. ఒకదానికి కట్టినట్టేచూపించినా ఫీజు మాత్రం రెండిటికి తన ఖాతాలో నుంచి వెళ్లిపోయిందని ఆ విద్యార్థి వాపోయాడు.మరో విద్యార్థి మూడింటికి ఫీజు కడితే రెండింటికే కట్టినట్టు చూపించింది. సమస్యలపై బోర్డు దగ్గరికెళి-తే ఇంటర్ అధికారి కార్యాలయానికి సిబ్బంది పంపుతున్నారు. అక్కడ తమ గోడును మొరబెట్టుకుం టేఅప్లికేషన్ లు తీసుకుని పంపించేస్తున్నారు. ఇప్పటిదా కా 252 మంది విద్యార్థులు ఈ సమస్యలతో వచ్చినట్టు బోర్డు అధికారులు చెబుతున్నారు. సమస్యలను ఆన్ లైన్ లో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్టుచెబుతున్నారు. ఫీజు చెల్లించిన విద్యార్థులు, చెల్లించని వారి వివరాలను వేరు చేసి చూపించాలి. కానీ, ఈవిషయంలోనూ గ్లో బరీనా విఫలమైనట్టు తెలుస్తోంది. కాలేజీ ప్రిన్సిపాళ్ల ఆధ్వర్యం లో విద్యార్థులు ఫీజుకడుతున్నారు. అయితే, కట్టినా కట్టనట్టు సాఫ్ట్​వేర్ లో నమోదవుతోందని ప్రిన్సి పాళ్లు ఆరోపిస్తున్నారు.