
న్యూఢిల్లీ: భారతదేశంలో అతిపెద్ద వినియోగ వస్తువుల కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) పర్సనల్ కేర్, ఫుడ్ వస్తువులపై ప్రభుత్వం కొత్త జీఎస్టీ విధానం ప్రకారం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. కొత్త ప్యాక్‌లు త్వరలో దేశవ్యాప్తంగా దుకాణాలకు చేరుకుంటాయి. డవ్ షాంపూ (180 ఎంఎల్) ధర రూ.165 నుంచి రూ.145కి, లక్స్ సబ్బు (100 గ్రాములు) రూ.35 నుంచి రూ.30కి తగ్గుతుంది.
లైఫ్‌బాయ్ సబ్బు (125 గ్రాములు) ధర కూడా రూ.33 నుంచి రూ.28కి తగ్గుతుంది. కిసాన్ జామ్ (500 గ్రాములు) ధర రూ.160 నుంచి రూ.140కి తగ్గింది. హార్లిక్స్ (కేజీ) రూ.390 నుంచి రూ.350కి అందుబాటులో ఉంటుంది. బ్రూ కాఫీ (100 గ్రాములు) ధర కూడా రూ.180 నుంచి రూ.160కి తగ్గుతుంది. ఈ ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను ప్రభుత్వం 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.