ఇంటింటికీ ఆరు గ్యారంటీ స్కీమ్ కార్డులు

ఇంటింటికీ ఆరు గ్యారంటీ స్కీమ్ కార్డులు

పద్మారావునగర్​, వెలుగు: ఆరు గ్యారంటీ స్కీమ్​లను అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేస్తామని కాంగ్రెస్​ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్​ మర్రి ఆదిత్యారెడ్డి  పేర్కొన్నారు. బన్సీలాల్​పేట డివిజన్​ సీసీ నగర్​ లో ఆదివారం ఇంటింటికీ 6  గ్యారంటీ స్కీమ్​లపై ప్రచారంలో భాగంగా పార్టీ నేతలు స్థానికులకు  కార్డులను పంపిణీ చేశారు. 

టీ పీసీసీ సెక్రటరీ ఎన్​. విఠల్, రాజేందర్​, శ్రీనివాస్​, నారాయణ, లక్ష్మణ్​, వేద ప్రకాశ్ ​యాదవ్​, ఓరం ప్రియాంక, రాము, విలాస్​, సురేశ్​, సత్యనారాయణ, గణేశ్​ ఉన్నారు.