ఇస్కాన్కు భూమి కేటాయించండి.. మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే వినతి

ఇస్కాన్కు భూమి కేటాయించండి.. మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే వినతి

మల్కాజిగిరి, వెలుగు: సికింద్రాబాద్ మహేంద్రహిల్స్​లో ఇస్కాన్ సంస్థకు భూమి కేటాయించాలని కోరుతూ మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత బోధనలు, యువతకు శిక్షణ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇస్కాన్ సంస్థకు సుమారు 500 నుంచి 1500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అక్కడ శ్రీకృష్ణ దేవాలయం, కల్యాణ మండపం, ఆధ్యాత్మిక విద్యా కేంద్రం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనపై మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే మల్కాజిగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత బలపడుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.