పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయా... అయితే, ఈ వాస్తు చిట్కాలను పాటించండి..

పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయా...  అయితే, ఈ వాస్తు చిట్కాలను పాటించండి..

సాధారణంగా ఎంతోమంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు లేదా అబ్బాయిలకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాటపడుతుంటారు.అయితే వారి జాతక దోషం ప్రభావం కారణంగా చాలామందికి ఎన్నో సంబంధాలు ఉన్నప్పటికీ అవి మాత్రం కుదరక పెళ్లి ఆలస్యం అవుతుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే వివాహం విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుందట. మరి ఆ వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగానే పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఇంట్లో ఉంటే ఇరుగుపొరుగు వారు, బంధువులు మొదటగా అడిగే ప్రశ్న.. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు? మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు? అని. ఈ ప్రశ్న, సదరు యువతీ, యువకుడికే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటుంది.

 కొందరికి వివాహం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పెళ్లిళ్లు కుదరవు. ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. అవి వారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తాయి. వయసు పెరిగిపోతుండటం, పెళ్లి ఇంకా అవకపోవడంతో మానసిక ఆందోళనలు రేకెత్తుతాయి. కొందరేమో.. సరైన భాగస్వామి దొరకని కారణంతో.. మరికొందరు పని దృష్టి పెట్టడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతుంటారు. 

ఈ విధంగా ఎన్ని సంబంధాలు చూసినా చాలామందికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, ఒకవేళ కుదిరిన పెళ్లికి ఎన్నో అడ్డంకులు ఏర్పడటం వల్ల చాలామంది పెళ్లి పీటలు ఎక్కలేక పోతున్నారు.ఇలా మాటి మాటికి వివాహానికి అడ్డంకులు ఏర్పడేవారు ఈ చిన్న పరిహారాలు పాటించడం వల్ల వివాహానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉండవని వాస్తు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మంచం ఏ దిశలో ఉండాలంటే: పెళ్లికాని స్త్రీ ఇంటి వాయువ్య దిశలో నిద్రపోవాలి. ఇంటి నైరుతి మూలలో అస్సలు నిద్రించకూడదు. ఇలా చేయడం ద్వారా పెళ్లి అవకాశాలు పెరుగుతాయి.

 అవివాహితుడైన యువకుడు ఈశాన్య దిశలో పడుకోవాలి. పెళ్లి కాని యువకుడు ఈశాన్య దిశలో నిద్రపోవటం వల్ల వీరికి తొందరగా పెళ్లి గడియలు దగ్గరికి వస్తాయి. ఆగ్నేయ దిశలో పడుకోకూడదు.

అచ్చుపోసిన ఇనుము.. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి మంచం కింద ఎలాంటి ఇనుప వస్తువును పెట్టుకుని పడుకోకూడదు. పెళ్లి కాని వారు తమ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా గదిలో సానుకూల శక్తి వస్తుంది.

బెడ్‌షీట్ రంగు.. పింక్, పసుపు, లేత ఊదా, తెలుపు వంటి లేత రంగు బెడ్ షీట్ మీద నిద్రించడం మంచిది. ఇది గదిలో సానుకూల శక్తిని పెంచుతుంది. వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తికి సానుకూల శక్తిని ఇస్తుంది.

దుస్తుల రంగు .. వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్ళికాని యువతీ యువకులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఈ రంగు అశుభంగా పేర్కొంటారు. ఈ రంగు నిరాశకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రంగు.. వివాహానికి అడ్డంకులుగా ఉన్న శని, రాహువు, కేతువులను సూచిస్తుంది. వీలైతే.. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ బట్టలు ధరించాలి.

గోడ రంగు.. ఇల్లు మొత్తం లేత రంగుల గోడలు ఉండాలి. గోడ కోసం పాస్టెల్ రంగులను ఎంచుకోవడం మంచిది. గోడలపై ముదురు రంగులను ఉపయోగించవద్దు.

భారీ వస్తువులు.. ఇంటి మధ్యలో బరువైన వస్తువులు లేదా మెట్లను ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఇది వివాహ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. బరువైన వస్తువులు ఇంట్లో ఉండటం.. వివాహం విషయంలో శ్రేయస్కరం కాదు.