రాజకీయాల్లోకి రాకపై త్వరలోనే చెప్తా

రాజకీయాల్లోకి రాకపై త్వరలోనే చెప్తా

భూమా మౌనిక తో పెళ్లి తన పర్సనల్ విషయమని మంచు మనోజ్ అన్నారు. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి  టీఆర్టీ కాలనీలో ఏర్పాటు చేసిన మహా గణపతిని భూమా మౌనికతో కలసి మంచు మనోజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చేది త్వరలోనే చెబుతానని తెలిపారు. రాజకీయ ప్రవేశం లాంటి విషయాలను ముందు మీడియాకే వెల్లడిస్తాని స్పష్టం చేశారు. ఇక మౌనికతో వివాహ విషయం నా వ్యక్తిగతమన్న మనోజ్.. ఇది సమయం కాదని, ఆ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీడియాకే ముందుగా  చెబుతానన్నారు. విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్... ప్రతి ఒక్కరికీ గణపతి ఆశిస్సులు ఉండాలని, అందరూ పిల్లాపాపలతో బాగుండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు.