వివాహిత దారుణ హత్య

వివాహిత దారుణ హత్య

భీమదేవరపల్లి, వెలుగు: వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ లో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గూళ్లరాజు తనకు సోదరి వరుస అయినా కోల సుమలతతో (32) వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సుమలత కొడుకు వెంకటేశ్​గతంలో రాజును మందలించాడు. ఇదే విషయంపై వెంకటేశ్​ పై రాజు ఆరునెలల కింద గొడ్డలితో దాడిచేయగా తీవ్రంగా గాయపడ్డాడు. 

రాజుపై కేసు నమోదు కావడంతో రాజీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో సుమలతతో మాట్లాడటానికి రాజు ఇంటికి వెళ్లగా ఆమె ఒప్పుకోకపోవడంతో గొడ్డలితో దాడిచేసినట్లు స్థానికులు తెలిపారు. ఆమె భర్త పోచయ్య, కూతురు తేజస్విని ఉదయం పొలం వద్దకు వెళ్లి సాయంత్రం రాగా, సుమలత రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.