
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు తులారాశిలో.. స్వాతి నక్షత్రంలో అక్టోబర్ 13 వరకు సంచరిస్తాడు. స్వాతి నక్షత్రం రాహువుకు సంబంధించినది. ప్రస్తుతం రాహువు మీనరాశిలో ఉన్నాడు. కుజుడు రాహువు నక్షత్రంలో సంచరించేటపప్పుడు సామరస్యం, నాయకత్వ లక్షణాలతో పాటు వాదనలను ఆలోచనాత్మకంగా ఎదుర్కొనే సత్తాను పెంచుతుంది. అయితే కొన్ని రాశుల వారు తొందనపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏరాశి వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం. . .
మేషరాశి : కుజుడు.. తులారాశిలో.. స్వాతి నక్షత్రంలోసంచరించే సమయంలో అంటే అక్టోబర్13 వరకు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కుటుంబంలో అనవసరంగా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు ఆవేశపరుడు.. వ్యాపార విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో ఆచితూచి వ్యవవహరించండి. ఈ సమయంలో ఆధ్యాత్మిక భావనతో.. ప్రశాంతంగా ఉండండి. ఉద్యోగస్తులకు పనిభారవ పెరుగుతుంది. అనవసరంగా ఆఫీసులో అవమానాలు ఎదుర్కొంటారు. ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. మిమ్మలను ఎవరు ఏమన్నా రియాక్ట్ కావద్దని జ్యోతిష్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆవేశాన్ని.. కోపాన్ని నియంత్రించుకోవడానికి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.. మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ.. వడమాల సమర్పించండి. ఇలా చేయడం వలన ఆవేశం పెంచే కుజుడు శాంతించేందుకు అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
కర్కాటక రాశి : ఈ రాశిలో కుజుడు నాలువ ఇంట్లో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రంలో నాల్గవ ఇల్లు ఆస్తి.. శాంతి నిలయాలుగా ఉంటాయి. తులారాశిలో.. స్వాతి నక్షత్రంలో కుజ సంచారం... ఈ రాశి వారిని ప్రభావితం చేస్తుంది. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తారు. ఆస్తి వివాదాలు .. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. ఏపని చేయాలో అర్దంకాని పరిస్థితిలో ఉంటారు. కాని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా.. శాంతంగా ఉండండి. కుజుడి కోపం తగ్గి.. కర్కాటక రాశి వారికి పరిస్థితులు అనుకూలించాలంటే దుర్గామాతను పూజించండి. అలాగే ప్రతి శుక్రవారం.. అమ్మవారికి పాయసం నైవేద్యాన్ని సమర్పించండి.
తులా రాశి: కుజుడు స్వాతి నక్షత్రంలో తులారాశిలో సంచారం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారికి సమస్యలు అధికం కానున్నాయి. ఈ సమయంలో ( అక్టోబర్ 13 వరకు) కుటుంబంలో వాదనలు, పనిలో సవాళ్లు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.. జ్వరం, అధిక రక్తపోటు లేదా ఆకస్మిక గాయాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బంధువులు.. మిత్రులతో విబేధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. మీ వల్ల లాభం పొందిన వారు కూడా మీకు శత్రువులుగా మారతారు. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. చాలా ఓపికగా, జాగ్రత్తగా పనిచేస్తే అంతా నార్మల్‌గా ఉంటుంది. ఈ కాలంలో హనుమంతుడిని ఆరాధించండి. మంగళవారం రోజున ఆంజనేయస్వామికి ప్రదక్షిణాలు చేయండి. శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతాయి.
మకర రాశి : తులారాశి... స్వాతి నక్షత్రంలో కుజుడు సంచరించే సమయంలో ఈరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు పెరగవచ్చు. కుటుంబంలో వివాదాలు కూడా ఉండవచ్చు. కాబట్టి, చాలా తెలివిగా వ్యవహరించండి. మీరు పిల్లల గురించి కొన్ని చెడు వార్తలను కూడా వినవచ్చు. వాహనాలు నడపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమ అధికం అవుతుంది. అనుకోకుండా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు సీనియర్లతో విబేధాలు ఏర్పడుతాయి. సహోద్యోగుల సహకారం అంతగా ఉండదు. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి దేవాలయాలను సందర్శించండి. ప్రతిరోజూ గణేశుడి ముందు నెయ్యి దీపం వెలిగించండి. అంతా మంచే జరుగుతుంది.తులసి చెట్టు దగ్గర ప్రతి రోజు ఉదయం .. సాయంత్రం దీపారాధన చేయండి.
కుంభ రాశి : ఈ రాశి వారికి అక్టోబర్ 13 వరకు ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. అనుకోకుండా గొడవలు ఏర్పడుతాయి. . ఈ సమయంలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరమని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనుకోకుండా ఖర్చులు ఏర్పడుతాయి. ప్రతి పనిలో కూడా గందరగోళం ఏర్పడుతుంది. తొందరపడి ఎవరికి ఎలాంటి వాగ్దానాలు ఇవ్వవద్దు. ప్రతిరోజూ "ఓం నమః శివాయ" అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మనస్సు కుదుటపడుతుంది .
మీన రాశి: ఈ రాశి వారు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. అనుకోకుండా కెరీర్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. బాధ్యతలు పెరగడం .. అనవసర ప్రయాణాలు.. పని ఒత్తిడి పెరుగుతాయి. ఎవరితోను ఎలాంటి వాదన పెట్టుకోవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. కష్టపడ్డ ఫలితం కనపడదు. సైలంట్ గా ఉండండి.. వ్యాపారస్తులు ఎవరితోను కఠినంగా మాట్లాడవద్దు.. నష్టపోయే అవకాశాలున్నాయి. ఎవరు ఎంత కఠినంగా మాట్లాడినా శాంతంగా ఉండండి. ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించండి. అలాగే ప్రతిరోజూ "ఓం రాం రహవే నమః" అనే రాహు మంత్రాన్ని పఠించండి. కెరీర్ లో స్థిరత్వం ఏర్పడి .. అడ్డంకులు తగ్గుతాయి.