కివీస్కు షాక్..సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగిన గప్తిల్

కివీస్కు షాక్..సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలిగిన గప్తిల్

న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి మార్టిన్ గప్తిల్‌ వైదొలిగాడు. అతన్ని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి విడుదల చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే కివీస్ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్ హోం తప్పుకున్నారు. తాజాగా గప్తిల్ కూడా తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 


 
గర్వంగా ఉంది...
న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని మార్టిన్ గప్తిల్ అన్నాడు. ఇన్నాళ్లు మద్దతు ఇచ్చిన జట్టు, క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా సెంట్రల్ కాంట్రాక్టు వదిలేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అయితే.. దేశం తరపున ఆడేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని వెల్లడించాడు. ఇతర దేశాల లీగ్స్లలో అవకాశాలు వస్తే కూడా ఆడతానన్నాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నట్లు గప్తిల్ చెప్పుకొచ్చాడు. 

టీ20ల్లో ప్రమాదకర బ్యాట్స్‌మన్
టీ20ల్లో గప్తిల్ అద్భుతమైన ఆటగాడు. ఒంటిచేత్తో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అయితే ఇటీవల జరిగిన సిరీస్ల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతన్ని ఎంపిక చేయలేదు. టీ20 వరల్డ్ కప్ కోసం గప్తిల్ను సెలక్ట్ చేయలేదు. దీనికి తోడు న్యూజిలాండ్ ఓపెనర్గా ఎంపికైన ఫిన్ అలెన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే గప్తిల్ను పక్కన పెట్టి ఫిన్ అలెన్ను ఆ దేశ క్రికెట్ బోర్డు ఎంపిక చేస్తోంది.