
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ విధానంలో
హైదరాబాద్: కస్టమర్లు సులభంగా, సౌకర్యంగా తమ కంపెనీ కార్లను పొందేందుకు ‘మంత్లీ సబ్‌స్క్రిప్షన్’ విధానాన్ని మారుతీ సుజుకీ ప్రారంభించింది. ఈ పైలెట్ ప్రాజెక్టును హైదరాబాద్, పుణేలో మొదలుపెట్టింది. కారును కొనుగోలు చేయకుండా వాడుకోవడానికి ఈ స్కీమ్ ఉపకరిస్తుంది. మారుతి సుజుకీ ఎరీనా నుంచి కొత్తస్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, ఎర్టిగా కార్లను తీసుకోవచ్చు. వీటికి వరుసగా 12, 18, 24, 30, 36, 42 నెలల మంత్లీ సబ్‌స్క్రిప్షన్ చెల్లించి నడుపుకోవచ్చు. 48 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త బాలెనో, సియాజ్ ఎక్స్ఎల్‌ను ఉపయోగించుకోవచ్చు. స్విఫ్ట్ కారుకు నెలకు రూ .18,350 కట్టాలి. తర్వాత కూడా కారుపై ఆసక్తి ఉంటే బైబ్యాక్ విధానంలో సొంతం చేసుకోవచ్చు.
For More News..