మారుతీ కార్లపై మస్తు డిస్కౌంట్లు

మారుతీ కార్లపై మస్తు డిస్కౌంట్లు

న్యూఢిల్లీ : మారుతీ సుజుకి కొన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈనెల నుంచి వినియోగదారులు జిమ్నీ, ఫ్రాంక్స్,  గ్రాండ్ విటారా వంటి మోడళ్లపై ఈ తగ్గింపులను పొందవచ్చు. డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌లు, నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌‌‌‌‌‌‌‌లు  కార్పొరేట్ ప్రయోజనాల రూపంలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.  ఇటీవల విడుదల చేసిన జిమ్నీ థండర్ ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను రూ. 10.74 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద కొనుగోలు చేయవచ్చు. 

ఎంట్రీ లెవల్ జిమ్నీ జీటా వేరియంట్‌‌‌‌‌‌‌‌పై రూ. 2.3 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆల్ఫా,  జెట్ వేరియంట్లపై కూడా రూ. 2 లక్షల తగ్గింపు ఉంటుంది.  మారుతి సుజుకి నెక్సా కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి ఫ్రాంక్స్​. కొన్ని ఫ్రాంక్స్​ వేరియంట్లపై రూ. 40వేల వరకు ప్రయోజనాలు ఉంటాయి.  గ్రాండ్ విటారా డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. ఈ మోడల్‌‌‌‌‌‌‌‌పై కస్టమర్లు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు తగ్గింపును పొందవచ్చు.  నగరం,  స్టాక్ లభ్యతను బట్టి తగ్గింపులు మారవచ్చని గుర్తుంచుకోవాలి.  ఖచ్చితమైన తగ్గింపుల గురించి తెలుసుకోవడానికి, మీ సమీపంలోని మారుతీ సుజుకి డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌కి వెళ్లాలి.