5స్టార్ సేఫ్టీ రేటింగ్తో..మారుతి సుజుకి విక్టోరిస్ వచ్చేసింది

5స్టార్ సేఫ్టీ రేటింగ్తో..మారుతి సుజుకి విక్టోరిస్ వచ్చేసింది

విక్టోరిస్ పేరుతో మిడ్​సైజ్​ ఎస్​యూవీని మారుతి సుజుకి బుధవారం లాంచ్​  చేసింది. ఈ కారుకు భారత్ ఎన్​క్యాప్​ క్రాష్​ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించడం విశేషం. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్, సీఎన్​జీ వెర్షన్లు ఉన్నాయి. 

పెట్రోల్ వేరియంట్లో మాన్యువల్ గేర్​బాక్స్ తో పాటు ఆటోమేటిక్ గేర్​బాక్స్ ఆప్షన్ ఉంది. హైబ్రిడ్ వెర్షన్ 28.65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.  విక్టోరిస్​లో లెవెల్​-2 అడ్వాన్స్​డ్​ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్), 6 ఎయిర్​బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ధరల వివరాలను కంపెనీ వెల్లడించలేదు.