అమ్మకాలు అంతంతే జులైలో బండ్ల సేల్స్​తక్కువే

 అమ్మకాలు అంతంతే జులైలో బండ్ల సేల్స్​తక్కువే

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలకు ఈ ఏడాది జులై పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి.  పెద్ద కంపెనీల హోల్​సేల్స్​ఒక అంకె గ్రోత్​కే పరిమితమయ్యాయి. మారుతి సుజుకీ అమ్మకాలు ఆరు శాతమే పెరిగాయి. టాటా, బజాజ్​అమ్మకాలు తగ్గాయి. హుండై అమ్మకాలు నాలుగు శాతమే పెరిగాయి. ఈ ఏడాది జులైలో మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు 1,81,630 యూనిట్లకు పెరిగాయి.   గత ఏడాది ఇదే నెలలో కంపెనీ తన డీలర్లకు మొత్తం 1,75,916 యూనిట్లను పంపామని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్​ఐఎల్​) ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్స్​ విక్రయాలు 1,52,126 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది జులై నెలలో 1,42,850 యూనిట్లు సేలయ్యాయి. ఆల్టో,  ఎస్-ప్రెస్సో వంటి మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు గత జులైలో 20,333 యూనిట్ల నుంచి 9,590 యూనిట్లకు తగ్గాయి. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్  స్విఫ్ట్‌‌‌‌‌‌‌‌తో సహా కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా 21 శాతం తగ్గి 67,102 యూనిట్లకు పడిపోయాయి. కంపెనీ గత ఏడాది జులైలో 84,818 యూనిట్ల కాంపాక్ట్​ కార్లను అమ్మింది. బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ  ఎక్స్​ఎల్​6తో కూడిన యుటిలిటీ వెహికల్స్​గత నెలలో 62,049 యూనిట్ల అమ్మకాలను సాధించాయి. 2022 జులైలో మారుతి 23,272 యూనిట్లను డీలర్లకు పంపింది. ఎగుమతులు 22,199 యూనిట్ల నుంచి 20,311 యూనిట్లకు తగ్గాయని ఎంఎస్​ఐ తెలిపింది.

ఒకశాతం తగ్గిన టాటా మోటార్స్

 జులైలో తమ మొత్తం విక్రయాలు 1 శాతం తగ్గి 80,633 యూనిట్లకు చేరుకున్నాయని టాటా మోటార్స్ మంగళవారం వెల్లడించింది. ఈ ఆటో మేజర్ గత జులైలో 81,790 యూనిట్లను విక్రయించింది. కంపెనీ దేశీయ విక్రయాలు జులైలో 78,978 యూనిట్ల నుంచి 78,844 యూనిట్లకు పడిపోయాయి. మొత్తం కమర్షియల్​ వెహికల్స్ విక్రయాలు గత ఏడాది ఇదే నెలలో 34,154 యూనిట్ల నుంచి 4 శాతం పడి 32,944 యూనిట్లకు తగ్గిపోయాయి. దేశీయ మార్కెట్​లో ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్​ గత జులైలో 47,505 యూనిట్ల నుంచి ఈసారి 47,628 యూనిట్లకు ఎగిశాయి. 

10శాతం తగ్గిన బజాజ్​సేల్స్​

బజాజ్ ఆటో సేల్స్​జులైలో 10 శాతం తగ్గి 3,19,747 యూనిట్లకు చేరుకున్నాయి. గత  జులైలో కంపెనీ 3,54,670 యూనిట్లను విక్రయించింది. దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కంపెనీ అమ్మకాలు గత జులైలో 1,82,956 యూనిట్ల నుంచి 2 శాతం తగ్గి 1,79,263 యూనిట్లకు పడిపోయాయి. గత జులైలో ఎగుమతులు 1,71,714 యూనిట్లు కాగా, ఈసారి జులైలో 18 శాతం తగ్గి 1,40,484 యూనిట్లకు పడిపోయాయి.

25 శాతం పెరిగిన ఎంజీ మోటార్​సేల్స్​

ఎంజీ మోటార్ ఇండియా  తన రిటైల్ అమ్మకాలు జులైలో 25 శాతం పెరిగి 5,012 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపింది.   గత జులైలో కంపెనీ 4,013 యూనిట్లను విక్రయించింది.  ఇటీవలి వరదల కారణంగా రిటైల్ అమ్మకాలు ప్రభావితమయ్యాయని ఎంజీ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

4 శాతం పెరిగిన టీవీఎస్​ అమ్మకాలు

టీవీఎస్  అమ్మకాలు 4 శాతం పెరిగి 3,25,977 యూనిట్లుగా నమోదయ్యాయి.  గతేడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 3,14,639 యూనిట్లను అమ్మింది. 2022 జులైలో 2,99,658 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే గత నెలలో మొత్తం టూవీలర్ల అమ్మకాలు 4 శాతం పెరిగి 3,12,307 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో టూవీలర్ల విక్రయాలు 2,01,942 యూనిట్ల నుంచి 2,35,230 యూనిట్లకు పెరిగాయి.

దూసుకెళ్లిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) జులైలో 21,911 యూనిట్లను అమ్మింది. ఒక నెలలో ఇన్ని బండ్లు అమ్మడం ఇదే మొదటిసారని కంపెనీ ప్రకటించింది.  గత జులైలో 19,693 యూనిట్లను డీలర్‌‌‌‌‌‌‌‌లకు పంపగా, ఈసారి ఇవి 11 శాతం పెరిగి 21,911 యూనిట్లకు చేరుకున్నాయి. గత నెలలో కంపెనీ దేశీయ హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్ 20,759 యూనిట్లుగా ఉండగా, ఎగుమతులు 1,152 యూనిట్లుగా ఉన్నాయి. టీకేఎం గతంలో మే 2023లో 20,410 యూనిట్లను విక్రయించడం ద్వారా అత్యుత్తమ నెలవారీ హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్​ను సాధించిందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్,  స్ట్రాటజిక్ మార్కెటింగ్) అతుల్ చెప్పారు.   

నాలుగుశాతం పెరిగిన హ్యుందాయ్ సేల్స్​

హ్యుందాయ్ మోటార్స్​ హోల్‌‌‌‌‌‌‌‌సేల్స్​ ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగి జులైలో 66,701 యూనిట్లకు చేరుకున్నాయి.ఈ సంస్థ గత జులైలో 63,851 యూనిట్లను తన డీలర్లకు పంపింది. దేశీయ విక్రయాలు గత నెలలో 50,500 యూనిట్ల నుంచి 50,701 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయని ఈ దక్షిణ కొరియా వెహికల్స్​ తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. గత జులైలో ఎగుమతులు 13,351 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 20 శాతం పెరిగి 16,000 యూనిట్లకు చేరుకున్నాయి.