
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 అదనపు సర్వీస్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంస్ఐ) సోమవారం తెలిపింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కొత్త ఫెసిలిటీని ప్రారంభించడం ద్వారా తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 5,500 టచ్‌పాయింట్‌లకు విస్తరించింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 460 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్‌లను ప్రారంభించామని ఎంఎస్‌ఐ సీఈఓ హిసాషి టకేయుచి వెల్లడించారు. తమ నెట్‌వర్క్కు ఒక సంవత్సరంలో మూడు కోట్ల మంది కస్టమర్ల వాహనాలకు సర్వీస్ చేయగల సామర్థ్యం ఉందన్నారు. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో 2.7 కోట్ల వాహనాలకు సర్వీస్ అందించామని వివరించారు.