మనిషికి పంది గుండె అమర్చిన అమెరికా డాక్టర్లు

మనిషికి పంది గుండె అమర్చిన అమెరికా డాక్టర్లు

అమెరికా డాక్టర్లు మరో అరుదైన ఘనత సాధించారు. పంది గుండెను విజయవంతంగా మనిషికి అమర్చారు. 57 ఏండ్ల వ్యక్తికి గుండె ఆపరేషన్ చేసిన వైద్యులు.. జన్యుపరంగా మార్పుచెందిన పంది గుండెను అమర్చారు. వైద్యచరిత్రలో ఇది తొలిసారని ప్రకటించారు. రాబోయే రోజుల్లో అవయవధానాల కొరతను అధిగమించొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మెరీ ల్యాండ్ మెడికల్ స్కూల్ ప్రకటన విడుదల చేసింది. గతంలో మనిషికి పంది కిడ్నీలను పెట్టి.. విజయం సాధించిన డాక్టర్లు.. తాజాగా గుండె ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ చేశారు. అయితే  గుండె ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని వైద్యులు తెలిపారు. మానవుడిలో పంది గుండె ఎలా పనిచేస్తుందనేదాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు వైద్యులు. 

ఇవి కూడా చదవండి:

హెల్త్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్లు ఎత్తుకెళ్లారు

Survey: యూపీలో అధికారం ఏ పార్టీదంటే