తిరుపతిలో మాస్క్ తప్పనిసరి : టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలో మాస్క్ తప్పనిసరి : టీటీడీ  ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. కొత్త ఏడాది సందర్భంగా భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు డిసెంబరు 31, జనవరి 1న సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశామన్న ఆయన.. జనవరి 2, 3 తేదీల్లో సిఫారసు లేఖలను స్వీకరించమని స్పష్టం చేశారు. 

ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చన్నారు.  జనవరి 2 నుంచి 11 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వివరించారు. ఈనెల 29 నుంచి జనవరి 3 వరకు అడ్వాన్స్డ్‌ విధానంలో వసతిగదుల కేటాయింపు రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్‌ పేర్కొన్నారు.