హైదరాబాద్ లో ముసుగుదొంగల బీభత్సం.. గంటలోనే ఐదు ఇళ్లలో చోరీ..

హైదరాబాద్ లో ముసుగుదొంగల బీభత్సం.. గంటలోనే ఐదు ఇళ్లలో చోరీ..

హైదరాబాద్ లో ముసుగుదొంగలు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలో ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కుత్బుల్లాపూర్ లోని పేట్ బషీర్ బాద్ పరిధిలోని దండమూడి ఎంక్లేవ్ లో ముసుగుదొంగలు బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలోనే ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడి హల్చల్ చేసారు దొంగలు. ఇనుప రాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో దొంగతనాలకు పాల్పడ్డారు ముగ్గురు దుండగులు.

దొంగతనం చేసే సమయంలో ఇళ్లలో అమర్చిన అలారం మోగడంతో పరారయ్యారు దొంగలు.ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డ దొంగలు మొత్తం ఒక కేజీ వెండి, 12 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తున్నట్లు తెలిపారు. 

దొంగతనానికి సంబందించిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఇనుప రాడ్లు, కట్టర్లు, వేటకొడవళ్లు, మారణాయుధాలతో ఇళ్లలోకి చొరబడుతున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఒకేసారి ఐదు ఇళ్లలో చోరీ జరగడంతో భయబ్రాంతులకు గురవుతున్నారు స్థానికులు. 

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో కూడా బీభత్సం సృష్టించారు దొంగలు.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ లో వరుసగా రెండు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. స్థానిక సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలోని రెండు ఇళ్లలో చోరీ జరిగింది. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను బద్దలుకొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. 

5కేజీల వెండి సామగ్రి,35 గ్రాముల బంగారం,60 వేల నగదు,విలువైన చీరలు ఎత్తుకెళ్లారు దొంగలు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఫుల్ సెక్యూరిటీ ఉన్న గ్రేటర్ కమ్యూనిటిలో దొంగల హల్చల్ చేయడంతో బయాందోళనకు గురవుతున్నారు కాలనీ వాసులు.