మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో మాస్క్‌‌లు రెడీ

మ‌హిళా సంఘాల ఆధ్వ‌ర్యంలో మాస్క్‌‌లు రెడీ

మరికల్ , వెలుగు : నారాయణపేట జిల్లా మరికల్మండల మహిళా సంఘం అధ్వర్యంలో మాస్క్‌లు రెడీ చేస్తున్నారు. బుధవారం ఏపీఎం వనజ మాట్లాడుతూ..డీఆర్డీవో ఆదేశాల మేరకు 450 మీటర్ల బట్టతో 6,750 మాస్క్​లను తయారు చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. గురువారం పూర్తి చేసి డీఆర్డీవో ర్యాలయానికి పంపిస్తామన్నారు.

మాస్కుల‌ తయారీలో స్వయం సహాయక సంఘాలు

మెదక్, వెలుగు: ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే కూలీల కోసం స్వయం సహాయక
సంఘాల ఆధ్వర్యంలో మాస్క్ లు తయారు చేయిస్తున్నారు. కుట్టుమిషన్లు ఉన్న మహిళలతో మాస్క్ లు కుట్టిస్తున్నారు అధికారులు. బుధవారం హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లిలో మహిళా సంఘ సభ్యులతో మాస్కులు కుట్టే పనులు షురూ అయ్యాయి. మండలంలోని ఉపాధి కూలీలకు సరిపడ మాస్క్ లు తయారు చేయిస్తున్నట్లు ఏపీవో రాజ్ కుమార్ తెలిపారు.