
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆగస్ట్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా మే 9న రిలీజ్ ఇప్పటికే ప్రకటించగా, షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది.
ఫైనల్‌గా ఆగస్ట్‌లో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ‘ధమాకా’ తర్వాత మరోసారి రవితేజకు జంటగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు దీని తర్వాత కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో రవితేజ సినిమా ఉండనుందని తెలుస్తోంది.