మొరాకోలో తీవ్ర భూకంపం.. 632కు పెరిగిన మృతుల సంఖ్య

మొరాకోలో తీవ్ర భూకంపం.. 632కు పెరిగిన మృతుల సంఖ్య

మొరాకోలో 2023 సెప్టెంబర్ 9 న అర్థరాత్రి సంభవించిన భూకంప సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.  ఇప్పటివరకు  632 మంది మరణించగా,  329 మంది గాయపడ్డారు.   51 మంది పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారితో సమీప ఆసుపత్రులు నిండిపోయాయి. 

మృతులు, క్షతగాత్రల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  భూకంపం కారణంగా ప్రధాన నగరాల్లోని అనేక భవనాలు, చారిత్రక కట్టడాలు దెబ్బతిన్నాయి. మొరాకో ప్రాంతంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.  రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రతను 6.8గా నమోదైంది.

ALSO READ :జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

భూకంపం వల్ల సంభవించిన ఘోరమైన ప్రాణనష్టంపై  భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ 20 సమ్మిట్ లో విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్‌ అండగా ఉంటుందని ఆపన్న హస్తం అందించారు.