అత్తాపూర్లో భారీ అగ్ని ప్రమాదం

అత్తాపూర్లో  భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ ప్రాంతంలోని బాడీ బిల్డర్ షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

భారీగా మంటలు ఎగసిపడుతోన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ  అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణలు తెలియాల్సి ఉంది.