ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం(అక్టోబర్ 30) అర్థరాత్రి ఓ షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మంటల్లో చిక్కుకుని చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 20 ఫైరింజన్లతో మంటలార్పారు. గాయపడిన వారిని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
