
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఆదివారం(సెప్టెంబర్14) తెల్లవారు జామున ఫెర్టిలైజర్స్కంపెనీలో పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మంటల్లో కాలిపోయి చనిపోయారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమేత్ర గ్రామ సమీపంలోని ఫెర్టిలైజర్స్ యూనిట్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఋ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి షిఫ్టులో మంటల చెలరేగాయి. ఈప్రమాదంలో ఇద్దరు కార్మికులు బీహార్ కు చెందిన మనీష్, మహారాష్ట్రకు చెందిన ఫుల్‌చంద్ మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సింది. ప్రమాదం విషయం తెలుసుకున్న ఫైర్‌సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు.
సంఘటన జరిగిన సమయంలో ప్లాంట్‌లో ఆరుగురు కార్మికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.