- 26 స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో తనిఖీలు!
- పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నర్సింహ
సూర్యాపేట, వెలుగు: జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు శనివారం భారీ ఎత్తున 'నాకాబంది కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు నిర్వహించారు. ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు జిల్లాలోని 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో, ఏకకాలంలో 23 ప్రత్యేక ప్రాంతాలు , 9 అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లలో తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం రోడ్డు, అమ్మ గార్డెన్ వద్ద నిర్వహించిన నాకాబందిని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు బస్సులను, వాహనాలను తనిఖీ చేసి, ప్రయాణికులతో మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలు, ప్రయాణ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం పోలీస్ శాఖ సాంకేతికతను వాడుకుంటూ ప్రజల చెంతకే వచ్చి సేవలు అందిస్తోందని. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఇంటి వద్దకే వచ్చి కేసు నమోదు చేస్తున్నారని, ప్రజలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో డిఎస్పీ నరసింహ చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్ఐలు శివతేజ, వెంకన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
