ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్!..6 వేల పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు

ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్‌మెంట్!..6 వేల పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కార్ దృష్టి పెట్టింది. ఏయే కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల 8వ తేదీలోగా ఇవ్వాలని వివిధ విభాగాల హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీలను ఆదేశించింది. ఈ మేరకు కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారీగా శాంక్షన్డ్​ పోస్టుల సంఖ్య, ప్రస్తుతం పని చేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలతో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీలు నివేదికలు తయారు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సుమారు 1,420 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇదివరకే సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించినట్టు తెలిసింది. గత రెండేండ్లలో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. మరో 8 కాలేజీల దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి. ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, లేకుంటే సమస్య అవుతుందని కాలేజీల ప్రిన్సిపాళ్లు చెప్తున్నారు.

పబ్లిక్ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 వేల వేకెన్సీలు

వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(వీవీపీ) పరిధిలో ఉండే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ పరిధిలో నుంచి వీవీపీ పరిధిలోకి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన సుమారు 70 హాస్పిటళ్లకు ఇప్పటివరకూ కేడర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు. ఈ హాస్పిటళ్లలో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. వీటితో పాటు మొత్తం 170 వీవీపీ హాస్పిటళ్లలో కలిపి సుమారు 4,700 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, గత రెండేండ్లలో మెడికల్ కాలేజీలుగా మారిన 17 హాస్పిటళ్లలో, ఇప్పటికీ వైద్య విధాన పరిషత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డాక్టర్లు, సిబ్బందే పనిచేస్తున్నారు. వీళ్లను వెనక్కి రప్పించి, వీవీపీ హాస్పిటళ్లలో పోస్టింగ్స్ ఇస్తే, వేకెన్సీల సంఖ్య తగ్గుతుంది. ఆ తర్వాత కూడా ఇంకో వెయ్యి స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, సుమారు 1,500 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉన్న పల్లె దవాఖాన్లలో కలిపి సుమారు 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అన్ని పోస్టులకూ ఒకేసారి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి అన్ని డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఖాళీల వివరాలతో సిద్ధమవుతున్నాయి. ఈ లెక్కన ఆరోగ్యశాఖలో 5,500 నుంచి 6 వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో సుమారు 3 వేల డాక్టర్ పోస్టులు, ఇంకో 3 వేలు పారామెడికల్, అడ్మినిస్ట్రేషన్ సంబంధిత పోస్టులు ఉండనున్నాయి.

పది రోజుల్లో కొత్త స్టాఫ్ నర్సులు!

ప్రస్తుతం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మెరిట్ లిస్టు కూడా విడుదల చేశారు. శనివారం నాటికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తికానుంది. ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారికి వారం, పది రోజుల్లో అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నారు.