సీఎంఏ ఫలితాల్లో మాస్టర్​మైండ్స్ హవా

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్​మైండ్స్ హవా

హైదరాబాద్, వెలుగు: సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్​మైండ్స్​ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. ‘ది ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ కాస్ట్స్​అకౌంటెంట్స్​ఆఫ్​ ఇండియా’ తాజాగా ప్రకటించిన ఫలితాల్లో తమ విద్యార్థులు సీఎంఏ ఇంటర్​లో మొదటి 50 ర్యాంకుల్లో ఫస్ట్​ర్యాంకుతోపాటు 44 మంది ర్యాంకులు సాధించారని మాస్టర్​మైండ్స్​అడ్మిన్​ అడ్వయిజర్​ మోహన్​గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంఏ ఫైనల్​లో మొదటి 50 ర్యాంకుల్లో సెకండ్​ ర్యాంకు సహా 23 మంది సత్తా చాటినట్లు చెప్పారు. సీఎంఏ ఇంటర్, ఫైనల్​ఫలితాల్లో మొదటి 10 ర్యాంకుల్లో 12 కైవసం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.