సీఎంఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ సత్తా

సీఎంఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాల్లో మాస్టర్‌ మైండ్స్‌ సత్తా

హైదరాబాద్, వెలుగు: ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) బుధవారం ప్రకటించిన సీఎంఏ( కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్) ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ స్టూడెంట్లు అఖిల భారతస్థాయిలో  సత్తా చాటారు. సీఎంఏ ఇంటర్ లో ప్రకటించిన టాప్-50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్స్ నుంచి 5వ ర్యాంకు పాటు ఇతర ర్యాంకులు సాధించిన విద్యార్థులు 49 మంది ఉన్నారు. గురువారం గుంటూరు, బ్రోడీపేట్ లోని మాస్టర్ మైండ్స్  ఆఫీసులో మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ మాట్లాడారు.  తమ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో విజయకేతనం ఎగురవేసినట్లు చెప్పారు. సీఎంఏ ఫైనల్ టాప్-50 ర్యాంకుల్లో 2వ ర్యాంకుతో పాటు 34 మంది విద్యార్థులు వేర్వేరు ర్యాంకులను సాధించారని వెల్లడించారు. సీఎంఏ ఫలితాలలో సమానమైన మార్కులు వచ్చినవారికి ఒకే ర్యాంకుని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులకు కూడా ప్రకటిస్తారని వివరించారు. సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకుల్లో 83 ర్యాంకులు కైవసం చేసుకున్న ఏకైక విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ అని ఆయన పేర్కొన్నారు.