మసూద హీరో మస్త్​ బిజీ..

మసూద హీరో మస్త్​ బిజీ..

డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు తిరువీర్. ఇటీవల ‘మసూద’ చిత్రంతో హిట్‌‌‌‌ను అందుకుని వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ఆదివారం తిరువీర్ బర్త్‌‌‌‌డే సందర్భంగా తను నటిస్తున్న కొత్త చిత్రాల అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ను ప్రకటించారు మేకర్స్. 

వీటిలో ప్రవీణ్ సత్తారు ప్రాజెక్ట్  ఒకటి. ‘మిషన్ తషాఫి’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో తిరువీర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సిరీస్‌‌‌‌కి ప్రణ‌‌‌‌తి రెడ్డి నిర్మాత‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

ఈ సిరీస్ గురించి తిరువీర్ మాట్లాడుతూ ‘ప్రవీణ్ స‌‌‌‌త్తారు డైరెక్షన్‌‌‌‌లో నటించడం ఎంతో సంతోషంగా ఉంది’ అన్నాడు. మరోవైపు జెన్నీఫర్ అల్ఫాన్స్ దర్శకత్వంలో ఓ చిత్రం, జి.గోపీ డైరెక్షన్‌‌‌‌లో మరో చిత్రం, సతీష్ బాబు తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో తిరువీర్ నటిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు.