
ఆసిఫాబాద్: మూఢనమ్మకాలు నమ్మవద్దని ఎంత అవేర్ నెస్ కార్యక్రమాలు చేసినా కొంతమంది ప్రజల్లో మార్పు రావడంలేదు. మూఢ విశ్వాసంతో శనివారం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కర్పతగూడ గ్రామానికి చెందిన బాలింత ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంట్లోనే పురుడుపోసుకోవాలన్న మూఢనమ్మకమే ఆమె పాలిట మృత్యువయ్యింది. ఆగస్టు- 16వ తేదీన కర్పతగూడకు చెందిన సుమలత మగబిడ్డకు జన్మనిచ్చింది.
రక్త హీనతతో, తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న సుమలత.. తీవ్ర అస్వస్థతకు గురైంది. రక్తం ఎక్కించాలని, వైద్యం చేయించుకోవాలని వైద్య సిబ్బంది ఎంత చెప్పినా వినలేదు. హస్పిటల్ కి రానని మొండికేసింది. చేసేదేమి లేక వైద్య సిబ్బంది వెనుదిరిగారు. అనారోగ్యంతో ఆమె శనివారం మృతి చెందింది. ఇకనైనా ప్రజల్లో మార్పు రావాలని సూచించారు డాక్టర్లు.