
పండుగ ఏదైనా ఎకోఫ్రెండ్లీ గిఫ్ట్స్ ఇస్తున్నారు చాలామంది. అలాగే రాఖీ పండక్కి కూడా ఎకోఫ్రెండ్లీ రాఖీలు తయారుచేస్తున్నారు కొందరు. ఉత్తర ప్రదేశ్లోని మథుర జిల్లా జైల్లోని ఖైదీలు కూడా అలాంటి రాఖీలు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వీళ్లతో పర్యవరణానికి హాని చేయని రాఖీలు తయారుచేయిస్తున్నారు జైలు అధికారులు. అక్కడి వాళ్లలో ఒక పది మంది ఖైదీలు పేపర్, గుమ్మడి గింజలు, మట్టితో రాఖీలు చేస్తున్నారు. అక్కడి ‘ఖజని వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ రాఖీల తయారీలో వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చింది. ఈ రాఖీలను ఒక్కోటి 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నారు. వీటి అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత ఆ ఖైదీలకు ఇవ్వనున్నారు.