‘మట్కా కింగ్’ రతన్ ఖత్రి మృతి

‘మట్కా కింగ్’ రతన్ ఖత్రి మృతి

ముంబై: ఇండియాలో బెట్టింగ్ రాకెట్ ను ప్రారంభించినవారిలో ఒకరు, ముంబైకి చెందిన మట్కా కింగ్.. రతన్ ఖత్రి(88) సోమవారం చనిపోయారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖత్రి ముంబై సెంట్రల్ ప్రాంతంలోని తన నివాసంలో శనివారం చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సింధీ కుటుంబానికి చెందిన ఖత్రి 1947 దేశ విభజన సమయంలో యుక్తవయసులో ఉన్నప్పుడు పాకిస్తాన్ లోని కరాచీ నుంచి ముంబైకి వచ్చారు. మట్కాను (1962 లో ముంబైలో పుట్టిన ఒక రకమైన జూదం) ఇండియాలోనే అతిపెద్ద బెట్టింగ్ రాకెట్‌గా మార్చినవారిలో రతన్ కీలక వ్యక్తి. అప్పట్లో ముంబైలో జూదం ఆటకు ఎక్కువ క్రేజ్ ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకుని రతన్ మట్కా పేరిట తన బెట్టింగ్ నెట్ వర్క్ ని దేశవ్యాప్తం చేసుకున్నారు. బెట్టింగ్ రాకెట్ ఆయన నియంత్రణలో దశాబ్దాలుగా కొనసాగింది.