IPL 2024: ఐపీఎల్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన గుజరాత్ ప్లేయర్

IPL 2024: ఐపీఎల్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన గుజరాత్ ప్లేయర్

ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పెర్త్‌లో టాస్మానియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ వేడ్ కెరీర్ లో చివరి టెస్ట్ మ్యాచ్. గుజరాత్ తరపున ఆడుతున్న ఈ ఆసీస్ స్టార్.. షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ కోసం ఐపీఎల్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని తెలిపాడు. మార్చి 21 నుండి 25 వరకు టాస్మానియాతో షెఫీల్ షీల్డ్ ఫైనల్ జరగనుంది.

ఆసీస్ డొమెస్టిక్ టోర్నీలో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీ. దీంతో వేడ్ ఈ మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే తాజాగా ఇదే తన చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని ఈ మ్యాచ్ తర్వాత టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. తన ఇన్నాళ్ల ప్రయాణంలో తనను ప్రోత్సహించిన అతని కుటుంబ త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ కు దూరమైనా వైట్-బాల్ (వన్డే, టీ20) క్రికెట్ లో కొనసాగుతున్నాని తన నిర్ణయాన్ని తెలియజేశాడు.    

ALSO READ :-బ్రేకింగ్ : మార్చి 16 మధ్యాహ్నాం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్

వేడ్ 2007లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతను 165 మ్యాచ్‌లలో 19 సెంచరీలు, 54 అర్ధసెంచరీలతో 9183 పరుగులు చేశాడు. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 442 క్యాచ్‌లు, 21 స్టంపింగ్‌లను సాధించాడు. హోబర్ట్‌లో జన్మించిన ఈ క్రికెటర్ 2012, 2021 మధ్య ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు ఆడాడు. నాలుగు సెంచరీలతో 29.87 సగటుతో 1613 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 2019 యాషెస్ సిరీస్‌లో రెండు సెంచరీలు చేయడం అతని కెరీర్ లోనే హైలెట్ గా నిలిచింది.