క్యాచ్ అందుకోకుండా వుడ్ను అడ్డుకున్న వేడ్

క్యాచ్ అందుకోకుండా వుడ్ను అడ్డుకున్న వేడ్

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20లో  అనూహ్య ఘటన జరిగింది. ఆసీస్  బ్యాట్స్మన్  మాథ్యూ వేడ్.. ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ను ఉద్దేశ పూర్వకంగా అడ్డుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. టార్గెట్ ఛేజింగ్లో భాగంగా క్రీజులోఉన్న వేడ్..మార్క్ వుడ్ బౌలింగ్లో బంతిని హిట్ చేశాడు. ఇది కాస్తా గాల్లోకి లేచింది. బంతిని చూడని వేడ్..రన్ కోసం ప్రయత్నించాడు. అవతలి ఎండ్లో వార్నర్ వద్దంటూ వారించడంతో..వేడ్ తిరిగి క్రీజు వైపునకు పరిగెత్తాడు. ఈ సమయంలో గాల్లో ఉన్న  బాల్ను క్యాచ్ అందుకోవడానికి మార్క్  వుడ్ రాగా..అతన్ని వేడ్..అడ్డుకున్నాడు. దీంతో వుడ్ బంతిని అందుకోలేకపోయాడు. 

ఇది కరెక్ట్ కాదు వేడ్..
మాథ్యూ వేడ్ కావాలనే  బంతిని అందుకోకుండా మార్క్ వుడ్ను అడ్డుకున్నట్లు రిప్లేలో కనిపించింది. ఈ ఘటనతో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై అంపైర్లు డిస్కస్ చేశారు. కానీ వేడ్ను మాత్రం ఔటివ్వలేదు. క్రికెట్ రూల్స్ ప్రకారం  ఫీల్డర్ బ్యాట్స్మన్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే మాత్రం ఔటివ్వాలి. కానీ ఈ ఘటనలో మాత్రం అంపైర్లు వేడ్ కు బ్యాటింగ్ చేసే అవకాశాన్నిచ్చారు. వేడ్ను ఔటివ్వకుండా కొనసాగించడంపై ఇంగ్లాండ్ అభిమానులు, క్రికెట్ నిపుణులు మండిపడుతున్నారు. వేడ్ తొండి ఆట ఆడాడని సోషల్ మీడియాలో  కామెంట్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు వేడ్ అంటూ పోస్టులు చేస్తున్నారు. 

 ఇంగ్లాండ్ గెలుపు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 68 పరుగులు, అలెక్స్ హేల్స్ 84 పరుగులు సాధించారు.నాథన్ ఎల్లీస్ 3 వికెట్లు, రిచర్డ్సన్, స్టోయినీస్,డానియల్ సామ్స్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత 209 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్..20 ఓవర్లలో 9 వికెట్లకు 200 పరుగులే చేసింది.  ఓపెనర్ డేవిడ్ వార్నర్ 73 పరుగులు చేయగా...మిచెల్ మార్ష్ 36 పరుగులు, మార్కస్ స్టోయినీస్ 35 పరుగులు చేశారు. మార్క్వుడ్ 3 వికెట్లు పడగొట్టగా..సామ్ కర్రన్, రీస్ టోప్లే తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. హేల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.