ప్రొఫెషనల్​ స్లీపర్స్ కోసం వెతుకుతున్న క్యాస్పెర్​

ప్రొఫెషనల్​ స్లీపర్స్ కోసం వెతుకుతున్న క్యాస్పెర్​

ఆఫీస్​లో లేదా  పనిచేసే చోట నిద్రపోతే  జాబ్​లోంచి తీసేస్తారు. కానీ, ఈ కంపెనీలో మాత్రం బాగా నిద్రపోయేవాళ్లనే  తీసుకుంటారు. అందుకు జీతం కూడా ఇస్తారు. ఈ కంపెనీ ఎక్కడ ఉందంటే... న్యూయార్క్​లో. అక్కడి కాస్పెర్​ అనే కంపెనీ  మ్యాట్రెస్​లు తయారుచేస్తుంది. బిజినెస్​ పెంచుకునేందుకు కొత్తగా ఆలోచించి... ‘క్యాస్పెర్​ స్లీపర్స్​’ కావాలని ఈమధ్యే ఒక ప్రకటన చేసింది.
తమ మ్యాట్రెస్​ మీద పడుకుంటే కంటినిండా నిద్రపడుతుందని చెప్పడంతో పాటు మార్కెట్​ పెంచుకునేందుకు  ‘ప్రొఫెషనల్​ స్లీపర్స్​’ కోసం వెతుకుతోంది క్యాస్పెర్​ కంపెనీ.  అందుకని ‘హాయిగా నిద్రపోవాలనుకునేవాళ్లు మా కంపెనీలో చేరండి. ఎందుకంటే... కంటినిండా నిద్ర  అనేది అన్ని విధాలా మంచిదని మేము నమ్ముతాం’ అని జాబ్  నోటిఫికేషన్​ ఇచ్చింది. 
ఈ లక్షణాలు ఉంటేనే...
‘ప్రొఫెషనల్​ స్లీపర్​’ జాబ్​కు అప్లై చేసేవాళ్లకు కొన్ని లక్షణాలు ఉండాలి. అవేంటంటే.. వాళ్లు తొందరగా నిద్రపోవాలి. ఎక్కువ టైం నిద్రపోవాలనే కోరిక ఉండాలి. చుట్టూరా ఏం జరిగినా ఏమీ పట్టనట్టు హాయిగా పడుకోవాలి.  అంతేకాదు ప్రొఫెషన్​ స్లీపర్స్​గా తమ అనుభవం గురించి సోషల్​ మీడియాలో కంటెంట్​ క్రియేట్​ చేయాలి. అలాగే తాము ఎంత బాగా నిద్రపోతామో చెప్పడానికి  టిక్​టాక్​లో వీడియో తీసి పంపాలి. ఈ జాబ్​కి అప్లై చేసేవాళ్లు న్యూయార్క్​ సిటీలో ఉండేవాళ్లనే తీసుకుంటారు. అంతేకాదు వాళ్ల వయసు 18 ఏండ్ల పైనే ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 11 అంటే ఈ రోజే  చివరి తేదీ. 
 ప్రొడక్ట్స్​ ఉచితంగా వాడుకోవచ్చు
​ ‘‘జాబ్​కి అప్లై చేసినవాళ్లు మా స్టోర్​లో వచ్చి క్యాస్పెర్​ పరుపుల మీద నిద్రపోవాలి. ఎక్స్​పీరియెన్స్​ గురించి  టిక్​టాక్​ వీడియోలు చేసి వాటిని క్యాస్పెర్​ సోషల్​ మీడియా ఖాతాల్లో పోస్ట్​ చేయాలి” అని చెప్పింది క్యాస్పెర్​ కంపెనీ.