
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్పూర్జిల్లా కొహల్మెటా పోలీస్స్టేషన్పరిధి అబూజ్మడ్ అడవుల్లో సోమవారం మావోయిస్టుల భారీ డంప్ ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్ఐజీ సుందర్రాజ్పి ఆదేశాలతో కూంబింగ్ చేపట్టిన బలగాలకు అడవుల్లో డంప్ కన్పించింది. దాన్ని ఓపెన్‌చేసి చూడగా మావోయిస్టులకు చెందిన నిత్యావసరాలు, యూనిఫామ్ లు, బెల్టులు, కిట్‌బ్యాగులు, బ్యాటరీలు, వైర్లు,పేలుడు పదార్థాలు, బాంబులు తయారు చేసే సామగ్రి ఉన్నాయి. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నారాయణ్పూర్జిల్లా కేంద్రానికి తరలించారు.