ఫార్ములా వన్‌‌ డ్రైవర్స్‌‌ టైటిల్‌‌ను నిలబెట్టుకున్న మ్యాక్స్‌‌ వెర్‌‌స్టాపెన్‌‌

ఫార్ములా వన్‌‌ డ్రైవర్స్‌‌ టైటిల్‌‌ను నిలబెట్టుకున్న మ్యాక్స్‌‌ వెర్‌‌స్టాపెన్‌‌

ఎఫ్‌‌‌‌1 చాంపియన్​షిప్​ సొంతం

సుజాక: రెడ్‌‌బుల్‌‌ స్టార్‌‌ మ్యాక్స్‌‌ వెర్‌‌స్టాపెన్‌‌  ఫార్ములా వన్‌‌ డ్రైవర్స్‌‌ టైటిల్‌‌ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన జపనీస్‌‌ గ్రాండ్‌‌ ప్రిలో విజేతగా నిలిచిన మ్యాక్స్‌‌ మరో నాలుగు రేసులు మిగిలుండగానే  వరుసగా రెండో ఏడాది ఎఫ్‌‌1 చాంపియన్‌‌గా నిలిచాడు. వర్షం అంతరాయం, వివాదాల మధ్య సాగిన ఫైనల్‌‌ రేసును పోల్‌‌ పొజిషన్‌‌ నుంచి ప్రారంభించిన ఈ డచ్‌‌ రేసర్‌‌ అందరికంటే వేగంగా  3 గంటల 1 నిమిషం 44 సెకండ్ల  టైమింగ్‌‌తో పోడియం ఫినిష్‌‌ చేశాడు.

తోటి రెడ్‌‌బుల్‌‌ డ్రైవర్ సెర్గియో పెరెజ్‌‌ (+27.066 సె) రన్నరప్‌‌గా నిలవగా.. చివర్లో పెనాల్టీ ఎదుర్కొన్న ఫెరారీ డ్రైవర్‌‌ చార్లెస్‌‌ లెక్లెర్క్‌‌ (+31.763 సె) మూడో స్థానంతో సరిపెట్టాడు. ఈ ఏడాది 18 రేసుల్లో 12 విజయాలు సాధించిన వెర్‌‌స్టాపెన్‌‌  మొత్తం 366 పాయింట్లతో ఎఫ్‌‌1 టైటిల్‌‌ ఖాయం చేసుకున్నారు. పెరెజ్‌‌ (253 పాయింట్లు), లెక్లెర్క్‌‌ (252)  తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు.