హైదరాబాద్, వెలుగు: మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ హైదరాబాద్ సోమాజిగూడ బ్రాంచ్ అత్యాధునిక వైడ్‌ఫీల్డ్ రెటీనా ఇమేజింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.
దీనిని వైడ్‌ఫీల్డ్ ఫండస్ కెమెరా అని పిలుస్తారు. ఇది సాధారణ కెమెరాల కంటే రెటీనాను స్పష్టంగా చూపిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లుకోమా, మయోపియా వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడానికి సాయపడుతుంది.
కంటిని డైలేట్ చేయాల్సిన అవసరం లేకుండానే వేగంగా పరీక్షలు చేయవచ్చని మాక్సివిజన్ ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ విధానం వల్ల ఓపీడీ సేవలు వేగవంతం అవుతాయని సీనియర్ సర్జన్ డాక్టర్ మురళీధర్ పేర్కొన్నారు.
