
విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్‌పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేయనున్నట్టు రిలీజ్ డేట్‌ను హీరోయిన్ కీర్తి సురేష్ రివీల్ చేసింది. ‘ఇదొక సెల్ ఫోన్ కథ. మన ఫోన్‌లో చాలా ఫీచర్లు ఉన్నట్టుగానే ఈ సినిమాలోనూ మంచి విజువల్స్, ఆకట్టుకునే పాటలు, హిలేరియస్ కామెడీ ఉన్నాయి. ఫుల్ ప్యాకేజీలా అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.