
విశాఖ టెస్ట్ లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. రెండో రోజు భారత ఓపెనర్లు… సౌతాఫ్రికా బౌలర్లను ఆడుకున్నారు. 202 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో సెకండ్ డే ఆట ప్రారంభించిన టీమిండియా….317 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. అంతకు ముందు కెరీర్ లో తొలి సెంచరీ చేశాడు మయాంక్ అగర్వాల్. 204 బాల్స్ లో 13 ఫోర్లు, 2 సిక్సులతో సెంచరీ చేశాడు. మరోవైపు 176 పరుగుల దగ్గర స్టెంప్ ఔట్ గా వెనుదిరిగాడు రోహిత్. 244 బాల్స్ 23 ఫోర్లు… ఆరు సిక్సులతో 176 రన్స్ చేశాడు. దీంతో ఫస్ట్ డౌన్ లో వచ్చిన పుజారా… అగార్వాల్ తో కలిపి క్రీజ్ లో కొనసాగుతున్నాడు.