భారత క్రికెటర్‌పై హత్యాయత్నం జరిగిందా..? దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

భారత క్రికెటర్‌పై హత్యాయత్నం జరిగిందా..? దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

టీమిండియా క్రికెటర్, సన్ రైజర్స్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరిన మ‌యాంక్ అగ‌ర్వాల్ విమానంలో మంచి నీళ్లు అనుకొని హానిక‌ర ద్రావ‌ణాన్ని తాగ‌డంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. దాంతో విమాన సిబ్భందితో పాటు క‌ర్ణాట‌క క్రికెట్ వ‌ర్గాలు అత‌డిని వెంటనే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం మ‌యాంక్ అగ‌ర్వాల్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

ఈ ఘ‌ట‌న‌పై త‌న మేనేజ‌ర్ ద్వారా మ‌యాంక్ అగ‌ర్వాల్ పోలీసుల‌కు ఫిర్యాదుచేసిన‌ట్లు తెలిసింది. హానికార‌క ద్రావ‌ణాన్ని మ‌యాంక్‌కు ద‌గ్గ‌రగా ఎవ‌రు ఉంచారు? అస‌లు ఏం జ‌రిగింది అనే కోణంలో పోలీసులు విచార‌ణ సాగిస్తోన్న‌ట్లు తెలుస్తుంది.పెద‌వుల వాపు కార‌ణంగా మ‌యాంక్ అగ‌ర్వాల్‌ మాట్లాడ‌లేక‌పోతున్నాడ‌ని, మ‌రో రెండు రోజుల త‌ర్వాతే అత‌డు పెద‌వి విప్పే అవకాశం ఉంద‌ని తెలిసింది. మ‌యాంక్ మాట్లాడితేనే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.మ‌రో రెండు మూడు రోజుల్లో ఈ ఘ‌ట‌న‌పై పూర్థిస్థాయిలో నిజానిజాలేమిటో వెలికితీయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క రంజీ టీమ్‌కు మ‌యాంక్ అగ‌ర్వాల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అనారోగ్యం కార‌ణంగా రైల్వేస్‌తో జ‌రుగ‌నున్న నెక్స్ట్ మ్యాచ్‌కు అత‌డు అందుబాటులో ఉండ‌టం లేద‌ని క‌ర్ణాట‌క క్రికెట్ అసోషియేష‌న్ ప్ర‌క‌టించింది. మ‌యాంక్ స్థానంలో నిఖిన్ జోస్‌కు సార‌థ్య బాధ్య‌త‌లు అప్ప‌గించింది. మ‌యాంక్ అగ‌ర్వాల్ టీమిండియా త‌ర‌ఫున 21 టెస్ట్‌లు, ఐదు వ‌న్డేలు ఆడాడు. 

టెస్టుల్లో ఒక డ‌బుల్ సెంచ‌రీతో 1488 ర‌న్స్ చేశాడు. చివ‌ర‌గా 2022 మార్చి శ్రీలంక‌తో చివ‌రి టెస్ట్ మ్యాచ్ ఆడాడు మ‌యాంక్ అగ‌ర్వాల్‌. ఆస్ట్రేలియాపై చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఆడాడు. అత‌డు టీమిండియా త‌ర‌ఫున ఆడి రెండేళ్లు దాటిపోయింది. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కు మ‌యాంక్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.