Mayasabha X Review : 'మయసభ' రివ్యూ: చంద్రబాబు-YSR రాజకీయ శత్రువులుగా ఎలా మారారంటే?

Mayasabha X Review : 'మయసభ' రివ్యూ: చంద్రబాబు-YSR రాజకీయ శత్రువులుగా ఎలా మారారంటే?

స్నేహం, రాజకీయాలు, వైరం.. ఈ మూడింటిని కలగలపి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ' మయసభ' ( Mayasabha ).  ఇప్పడు ఇది OTT ప్లాట్ ఫామ్ సోనీలివ్ ( Sony LIV )లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన పోలిటికల్ డ్రామాతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయలను ప్రభావితం చేసేలా దేవకట్ట , కిరణ్ జయకుమార్ ఈ కథను ఎలా తీర్చిదిద్దారు. మరి వారి అంచనాలను అందుకుందా..  ప్రేక్షకులను ఆకట్టుకుందా.. లేదా.?  తెలుగు ప్రజల స్పందన ఎలా ఉందో చూద్దాం.. 

ఉమ్మడి ఏపీ రాజకీయలే ప్రధానంగా..

శక్తివంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ఒకప్పుడు స్నేహితులుగా ఉండి, వారి మధ్య ఏర్పడిన విభేదాలు, పరిణామాలు ప్రధాన ఇతివృత్తంగా  ఈ ' మయసభ' సిరీస్ తీర్చిదిద్దారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7, 2025 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంతోంది. ఇందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయలు ఎన్టీఆర్ ( NTR ), చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) ,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy ) పాత్రలు ప్రధానంగా చూపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కథాంశం.. 
ఒక రాజకీయ డ్రామాతో కూడిన ఈ ' మయసభ'లో 1970ల నుండి 1990ల మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిణామాలను చూపిస్తుంది. ఈ సిరీస్ ఇద్దరు ముఖ్య వ్యక్తులు, కాకర్ల కృష్ణమ నాయుడు ( చంద్రబాబు నాయుడు ) , ఎం.ఎస్. రామిరెడ్డి ( వైఎస్ రాజశేఖర్ రెడ్డి ) స్నేహితులుగా మొదలై, రాజకీయ శత్రువులుగా ఎలా మారారనేది చాలా డీటెయిల్డ్‌గా చూపిస్తుంది. వీరి పాత్రలలో  ఆది పినిశెట్టి , చైతన్య రావు పోషించారు.  వారి అద్భుత నటన ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది.

ప్రతికార రాజకీయాలు.. 
ఈ సిరీస్ ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వారు రాజకీయాల్లోకి రావాలని కలలు కంటారు. వారిలో ఒకరు కృష్ణమ నాయుడు . మరొకరు ఎంఎస్ రామి రెడ్డి.  యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ ఎన్నికల నుంచి అసలు రాజకీయం మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో రాజకీయాలు, కుల సమీకరణాలు, వాటి మధ్య ఉండే వైరుధ్యాలు ప్రధానాంశాలుగా ఉన్నాయి. 'కుక్కలు రొట్టె కోసం కొట్టుకుంటే, మూడోది వచ్చి పట్టుకుపోయింది' వంటి డైలాగులతో నాయకుల మధ్య ఉండే వైరుధ్యాలను చూపించారు. 

ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి, చైతన్య రావులతో పాటు సాయి కుమార్, దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్, శత్రు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌తో దివ్య దత్తా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. దేవ కట్ట , కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో ఈ మయసభను తీర్చిదిద్దారు., విజయ్ కృష్ణ లింగమనేని , శ్రీ హర్ష నిర్మించిన ఈ సిరీస్‌లోని ప్రతి అంశం అద్భుతంగా కుదిరిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. 

ప్రేక్షకుల నుండి ప్రశంసలు
ఈ సిరీస్‌కి ప్రేక్షకుల నుండి, ముఖ్యంగా X లో, అద్భుతమైన స్పందన లభిస్తోంది. చాలామంది నెటిజన్లు దీనిని భారతీయ సినిమా చరిత్రలోనే ఉత్తమ పొలిటికల్ డ్రామా అని ప్రశంసిస్తున్నారు. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడుతున్నారు. ఒక యూజర్, “#Mayasabha తో  దేవ కట్ట  రాతను ఈరోజు మళ్లీ చూసాను. ఆది పినిశెట్టి, చైతన్య రావు , మిగతా నటీనటులు అద్భుతంగా నటించారు. బ్రిలియంట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, అద్భుతమైన నటన. తప్పక చూడాల్సిన సిరీస్” అని ట్వీట్ చేశారు.

మరొకరు, “#Mayasabha కచ్చితంగా బెస్ట్ పొలిటికల్ డ్రామాల్లో ఒకటి. బ్రిలియంట్‌గా క్రాఫ్ట్ చేశారు! ఒక ఫిక్షనల్ కథగా ఇది పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటోంది. దేవ కట్ట  దర్శకత్వం, రచన అద్భుతం. ఈ జెమ్ బ్యాక్ చేసిన విజయ్ కృష్ణకు నా హృదయపూర్వక అభినందనలు. ఆది, చైతన్య రావు , మిగతా నటీనటులు తమ పాత్రల్లో జీవించారు అని ప్రశంసించారు

మరికొందరు ఈ సిరీస్‌ని బెస్ట్ బయోపిక్ అని కూడా పొగిడారు. ఒక నెటిజన్, చాలా మంచి వెబ్ సిరీస్! YSR పాత్ర పోషించిన నటుడు సూపర్ గా చేశారు. ఈ ఎపిసోడ్‌లో సాయి కుమార్ మాస్. ఇటీవల కాలంలో వచ్చిన వాటిలో మంచి సిరీస్. వారాంతం చూడాల్సిన సిరీస్ అని చెప్పారు. రెండో వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ట్విట్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  జరిగిన రాజకీయ పరిణామాలే ఇతివృత్తంగా రూపుదిద్దుకున్న ఈ సీరిస్ తెలుగు , తమిళం, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఈ సిరీస్ లో పదునైన సంభాషణలు, కథనం తెలుగు ప్రేక్షకులను ఇంకా  ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.