నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు.. మేయర్ ఆదేశాలు

నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు.. మేయర్ ఆదేశాలు

కస్టమర్లకు భద్రత కల్పించే క్రమంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జనవరి 7న ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మేయర్‌, ఆరోగ్యశాఖ అదనపు కమిషనర్‌ స్నేహాశబరీష్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, కార్పొరేటర్లతో కలిసి నగరవాసులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంపై దృష్టి సారించారు. ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు తమ తమ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నుంచి సాంపిళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పరీక్షించాలని మేయర్‌ విజయలక్ష్మి సూచించారు.

నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం, నిబంధనలు పాటించని సంస్థలు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలాలని విజయలక్ష్మి చెప్పిారు. కల్తీ ఆహారంపై క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రమైన వంటశాలల ఆవశ్యకతను, నాణ్యమైన పదార్థాలను వినియోగించాలని మేయర్‌ సూచించారు. కల్తీని అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా చర్యలు చేపట్టాలని మేయర్ పిలుపునిచ్చారు.

ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్లు తమ తనిఖీల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) విభాగంతో సహకరించాలని కూడా విజయలక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ, కార్పొరేటర్లు నరసింహారెడ్డి, సీవీ రెడ్డి, శ్రవణ్, రాజశేఖర్ రెడ్డి, బన్నాల గీతా ప్రవీణ్, పద్మా వెంకట్ రెడ్డితో పాటు పలువురు ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్లు పాల్గొన్నారు.