
హైదరాబాద్, వెలుగు: సిటీలోని నాలాల పనులు లేట్అవుతుండడంతో ఆఫీసర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. పనులు పూర్తయ్యే వరకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని బల్దియా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎల్ బీనగర్ జోన్‌లోని బండ్లగూడ నుంచి నాగోల్ చెరువు వరకు చేపట్టిన నాలాల అభివృద్ధి పనులను మంగళవారం ఆమె ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆఫీసర్లతో జోనల్ ఆఫీసులో మీటింగ్నిర్వహించారు. ఎల్ బీనగర్ పరిధిలో చేపట్టిన 10 నాలాల పనులు 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పారు. అప్పటివరకు ఇక్కడి ఆఫీసర్లకు లీవ్స్ఇవ్వొద్దని ఎస్ఎన్ డీపీ సీఈ కిషన్‌ని ఆదేశించారు. పనుల వివరాలను ప్రతిరోజు తనకు పంపాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా చేసేందుకు రూ.858 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ పంకజ, ఆఫీసర్లు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.