కరీంనగర్ లో మయూర హోటల్ కు రూ.25 వేలు ఫైన్

కరీంనగర్ లో మయూర హోటల్ కు రూ.25 వేలు ఫైన్

కరీంనగర్, వెలుగు: కిచెన్, డైనింగ్ హాల్ అపరిశుభ్రంగా ఉండడంతో కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న మయూర హోటల్‌‌‌‌‌‌‌‌కు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ రూ.25 వేలు ఫైన్ వేశారు. ఇటీవల ఈ హోటల్‌‌‌‌‌‌‌‌కు ఫైన్ వేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఫుట్‌‌‌‌‌‌‌‌పాత్ ఆక్రమణలను డీఆర్ఎఫ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగించారు. 

మయూర హోటల్ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా కనిపించడంతో పరిశీలించారు. అనంతరం హోటల్‌‌‌‌‌‌‌‌లో కిచెన్, డైనింగ్ హాల్‌‌‌‌‌‌‌‌ను తనిఖీ చేయగా అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రూ.25 వేలు ఫైన్ విధించారు. జూన్ 4న ఇదే హోటల్‌‌‌‌‌‌‌‌లో పూరీ కర్రీలో ఈగ రావడంతో కస్టమర్ ఫిర్యాదు మేరకు మున్సిపల్ ఆఫీసర్లు రూ.10 వేలు ఫైన్ వేశారు. ఆ తర్వాత మరోసారి ఫైన్ విధించారు.