FIFA World Cup: ఎంబాపె డబుల్‌.. మిరోస్లావ్ క్లోజ్ రికార్డు సమం.. వరల్డ్ కప్లో నాకౌట్ దశకు ఫ్రాన్స్

FIFA World Cup: ఎంబాపె డబుల్‌.. మిరోస్లావ్ క్లోజ్ రికార్డు సమం.. వరల్డ్ కప్లో నాకౌట్ దశకు ఫ్రాన్స్
  • ఇరాక్‌‌‌‌‌‌‌‌పై 3-0తో ఘన విజయం

ఫిలడెల్ఫియా: ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ జట్టు జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఐ లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ 3–0తో ఇరాక్‌‌‌‌‌‌‌‌పై గెలిచి నాకౌట్‌‌‌‌‌‌‌‌ దశకు అర్హత సాధించింది. స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ కైలియన్‌‌‌‌‌‌‌‌ ఎంబాపె (14, 54వ ని) రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఫలితంగా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక గోల్స్‌‌‌‌‌‌‌‌ (16) చేసిన రెండో ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు.

ఈ క్రమంలో జర్మనీ లెజెండ్‌‌‌‌‌‌‌‌ మిరోస్లావ్‌‌‌‌‌‌‌‌ క్లోజ్‌‌‌‌‌‌‌‌ (16) రికార్డును సమం చేశాడు. బాలోన్‌‌‌‌‌‌‌‌ డి ఓర్‌‌‌‌‌‌‌‌ విజేత ఉస్మానే డెంబెలే (66వ ని) ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌కు మరో గోల్‌‌‌‌‌‌‌‌ అందించాడు. కెరీర్‌‌‌‌‌‌‌‌లో వందో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడిన ఎంబాపె ఆట ప్రారంభం నుంచి వరుస దాడులతో ఇరాక్‌‌‌‌‌‌‌‌ రక్షణ శ్రేణిని ఛేదించాడు. ఈ క్రమంలో ఎడమ కాలితో కొట్టిన గోల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కే హైలెట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది.

తొలి సగం ముగిసేసరికి భారీ వర్షం, పిడుగులతో కూడిన వర్షం రావడంతో ఆటను రెండు గంటల పాటు నిలిపేశారు. సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లోనూ అదే జోరును కొనసాగించిన ఎంబాపె 54వ నిమిషంలో ఇరాక్‌‌‌‌‌‌‌‌ డిఫెండర్‌‌‌‌‌‌‌‌ చేసిన తప్పును ఉపయోగించుకుంటూ రెండో గోల్ సాధించాడు.

ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ దూకుడును నిలువరించడంలో ఇరాక్‌‌‌‌‌‌‌‌ ఘోరంగా విఫలమైంది. 26వ నిమిషంలో స్ట్రయికర్‌‌‌‌‌‌‌‌ ఐమెన్‌‌‌‌‌‌‌‌ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ గాయంతో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ను వీడటం దెబ్బతీసింది. గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ బాసిల్‌‌‌‌‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ దాడులను అడ్డుకోలేకపోయాడు.