
కాళోజీ హెల్త్ యూనివర్శిటీలో MBBS,BDS అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యిందని వీసీ కరుణాకర్ రెడ్డి తెలిపారు. MBBS,BDS అడ్మిషన్ల కోసం ఇప్పటి వరకు 6వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. నీట్ ర్యాంకు ఉన్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4800 సీట్లతోపాటు EWS విభాగంలో 190 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 2750 సీట్లు, మైనార్టీ కాలేజీల్లో 550 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వెబ్ ఆప్షన్ల ద్వారా సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. కరోనా కారణంగా ఆన్ లైన్‌లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తున్నామని తెలిపారు. కాలేజీలు ప్రారంభమైన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుదన్నారు. ఆలిండియా కోటాలో వెళ్లినవారు సర్టిఫికెట్ అప్లోడ్ చేయకపోతే అనర్హులని ప్రకటించారు. కరోనాను బట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు వీసీ.