ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓ ట్రాన్స్ జెండర్ విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్రాన్స్ జెండర్ అభ్యర్థి బాబీ కిన్నార్.. సుల్తాన్ పురిఏ వార్డు నుంచి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. బాబీ 6,714 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వరుణ ఢాకా పై గెలిచారు. తనను గెలిపించిన వారికి బాబీ ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో అవినీతిని పారద్రోలేందుకు పోరాటం చేస్తానని చెప్పారు. తన నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు.
బాబీ కిన్నార్ సామాజిక కార్యకర్త. అన్నా హజారే తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బాబీ కిన్నార్ కు టికెట్ ఇచ్చింది. ఓ ట్రాన్స్ జెండర్ అభ్యర్థికి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు వరుసలో ఉంది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆప్ ముందు వరుసలో ఉంది. దీంతో ఆప్ గెలుపు ఖాయం అని పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

