24 గంటల్లోపే ట్యాంకర్​ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్​రెడ్డి

24 గంటల్లోపే ట్యాంకర్​ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్​రెడ్డి
  • బుక్​చేసిన 12 గంటల్లోపు అందించేలా ప్లాన్ ​చేస్కోవాలి

హైదరాబాద్, వెలుగు: ట్యాంకర్ బుకింగ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ప్రయత్నించాలని వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన వాటర్​బోర్డు హెడ్డాఫీసులో వేసవి కార్యాచరణ, ట్యాంకర్ మేనేజ్ మెంట్​పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితిపై ఆరా తీశారు. 

ప్రస్తుతం ట్యాంకర్ ​బుక్​ చేసిన 24 గంటల్లో డెలివరీ చేస్తున్నామని, 12 గంటలకు తగ్గించాలని సూచించారు. ఏప్రిల్​నెలలో కొత్త ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్స్ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రాత్రి వేళల్లో ట్యాంకర్ల సరఫరాతో పెండెన్సీ బాగా తగ్గిందన్నారు. మార్చి నెలలో మొత్తం 1,68,996 ట్యాంకర్లు డెలివరీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెలలో 22 నాటికి 1,67,134 ట్రిప్పులు సరఫరా చేసినట్లు తెలిపారు. 

మురుగు నీటి నిర్వహణపై ఫోకస్​ పెట్టాలన్నారు. డైరెక్టర్ ఆపరేషన్స్-1, అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్,  డైరెక్టర్ ఆపరేషన్స్-2 స్వామి, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.